ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 03:36 PM

రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబ శివరెడ్డి 'మెగా జాబ్ మేళా' పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులు అందరూ మీ అర్హత ని బట్టి ఈ జాబ్ మేళా ని వినియోగించుకుని భవిష్యత్తు నిర్మాణానికి అడుగులు ముందుకు వేయాలని మనవి చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారన్నారు.ఈనెల 16, 17న తిరుపతి. 23, 24 తేదీలలో విశాఖపట్నం. 30 మే 1 న గుంటూరులో ఈ జాబ్ మేళాలు జరుగుతాయి అని వీటి ద్వారా వివిధ ప్రైవేట్‌ కంపెనీల్లో సుమారు 15 వేల ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది అని అన్నారు.ఈ మెగా జాబ్ మేళాలో 150 పైగా కంపెనీలు 15వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ప్రముఖ, సాఫ్ట్ వేర్, బీపీవో, ఆటోమొబైల్, ఫార్మా, మొబైల్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్ మరియు అనేక మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు పాల్గొనే ఈ మెగా జాబ్ మేళా లో 10, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, బీటెక్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు కలవు. అనేక కంపెనీలు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు జారీ చేసేవిధంగా సిద్ధంగా ఉన్నాయి అనీ మరిన్ని వివరాలకు www. ysrcpjobmela. com లింక్ మీద క్లిక్ చేసి ఈ జాబ్ మేళాకి మీ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa