ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాంతర్ వెలుతురులోనే ఇంటింటికి లోకేష్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 03:41 PM

సీఎం జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని అంధకారప్రదేశ్ గా మార్చేసారు. ఒక పక్క బాదుడు...మరోపక్క కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో భాగంగా కురగల్లు గ్రామంలో నారా లోకేష్  పర్యటిస్తున్న సందర్భంలో కరెంట్ పోవడంతో లాంతర్ వెలుతురులోనే గ్రామంలో పర్యటించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గ్రామంలో ప్రతి ఇంటికి కొవ్వొత్తు, అగ్గిపెట్టె, విసనకర్ర అందించారు. లోకేష్ గెలిస్తే నియోజకవర్గంలో ఇళ్లు కూలుస్తాడని ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆర్కే ఏకంగా సొంత జేసిబి కొని పేదల ఇళ్ళు కూలుస్తున్నారు అని లోకేష్ ఆరోపించారు. కురగల్లు గ్రామంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన 230 ఇళ్లకు చెందిన వారితో కలిసికట్టుగా న్యాయ పోరాటం చేసి ప్రక్రియను ఆపిన సందర్భంగా గ్రామస్థులు నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa