ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్విట్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 04:04 PM

మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్విట్ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాను ఫాలో అయితే చాలు. అరుదైన, ఆకర్షణీయమైన, ఆలోచింపచేసే అంశాలను తెలుసుకోవచ్చు. ఇలాంటివి తరచుగా ఆయన పది మందితో షేర్ చేసుకుంటూ ఉంటారు.  తాజాగా మౌంట్ ఎవరెస్ట్ కు సంబంధించి వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. మరొకరు పోస్ట్ చేసిన వీడియోను ఆయన రీపోస్ట్ చేశారు. ‘‘మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై నుంచి 360 డిగ్రీల కోణంలో చూపించేది. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. నీవు ఎవరెస్ట్ శిఖరంపై ఉన్నావని ఊహించుకుని, ప్రపంచాన్ని విశాలంగా చూసేందుకు ఇది సాయపడుతుంది. పెద్ద అంశాన్ని సులభంగా చూడొచ్చు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తన ట్వీట్స్ తో సానుకూల ఆలోచనలను, భావాలను పెంచే ప్రయత్నం కూడా ఆనంద్ మహీంద్రా చేస్తుంటారు. ఆయన పెట్టే ట్వీట్స్ కొన్ని సందర్భాల్లో ఎంతో మందిని ఆలోచింపజేస్తుంటాయి. మానవత్వానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa