ఏం తిన్నా.. తినకపోయినా.. కొందరి పొట్ట ఎల్లప్పుడూ ఉబ్బిపోయి కనిపిస్తుంటుంది. కారణం గ్యాస్. చిన్నారుల నుంచి పెద్దల వరకు గ్యాస్ తో సతమతం అవుతున్నారు. దీంతో కొంతమంది ఏ ఆహారం తినాలన్నా భయపడిపోతున్నారు. అలాంటి వారు ఈ పండ్లను తీసుకుంటే గ్యాస్ సమస్య నుంచి వెంటనే రిలీఫ్ అవ్వొచ్చు.
--అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన ఒక గంట తరువాత ఒక అరటి పండును తింటే పొట్టలో ఉండే గ్యాస్ మొత్తం పోతుంది. పొట్ట తేలిగ్గా మారుతుంది. దీంతోపాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
-- అధిక శాతం నీరు, ఫైబర్ ఉండే పుచ్చకాయ ముక్కలను భోజనం చేసిన తరువాత తీసుకుంటే వెంటనే గ్యాస్ ట్రబుల్ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
-- ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉండే కివీ పండ్లను భోజనం అనంతరం తింటే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
--రాత్రి భోజనం చేశాక లేదా ఉదయం పరగడుపునే 3-4 అంజీర్ పండ్లను తింటే జీర్ణ సమస్యలు ఏవీ ఉండవు.
--ఇంకా కీరదోస, స్ట్రాబెర్రీ లను కూడా రోజూ తీసుకుంటూ ఉంటె అజీర్తి సమస్యలకు చెక్ చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa