ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాహనదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త రూల్స్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 08:48 AM

వాహనాల ఫిట్ ​నెస్​ టెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా మాత్రమే ఫిట్ ​నెస్​ టెస్ట్ చేసేలా కొత్త విధానం రూపొందించింది. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల ద్వారా ఫిట్ నెస్ టెస్ట్ చేయిస్తే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. 2023 ఏప్రిల్​ 1 నుంచి భారీ సరకు రవాణా వాహనాలు, బస్సులు వంటి భారీ ప్రయాణ వాహనాలకు ఆటోమేటెడ్ ఫిట్​నెస్​ టెస్ట్ ​ను తప్పనిసరి చేసింది. మధ్యతరహా, చిన్న రవాణా వాహనాలకు 2024 జూన్ 1 నుంచి ఏటీఎస్​తో ఫిట్​నెస్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాలు కొని 15 ఏళ్లు గడిచాక రిజిస్ట్రేషన్​ ను పునరుద్ధరించకోవాలి. రిజిస్ట్రేషన్​ రెన్యూవల్​ సమయంలోనే ఫిట్​నెస్ టెస్ట్​ చేయించుకోవాలని రవాణా శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం 8 ఏళ్లలోపు కమర్షియల్ వాహనాలకు రెండేళ్ల పరిమితితో రీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎనిమిదేళ్లు దాటిన కమర్షియల్​ వాహనాలకు ఒక సంవత్సరం కాలపరిమితి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa