ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో పృథ్వీ షా (61), పంత్ (39*), సర్ఫరాజ్ ఖాన్ (36*) రాణించారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించారు. బ్యాటింగ్ లో డికాక్ (80) రాణించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (24), ఎవిన్ లూయిస్ (5), దీపక్ హుడా (11) నిరాశపరిచారు. కృనాల్ పాండ్య (19*), బదోనీ (11*) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, లలిత్ యాదవ్, శార్దూల్ ఒక్కో వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa