దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై ప్రతిపక్ష నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక అమ్మాయి మాత్రం వెరైటీగా నిరసన తెలిపింది. ఆమె ప్లకార్డు పట్టుకుని నిలుచున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఇప్పుడు పెట్రోల్ కన్నా బీర్ చాలా చీప్. తాగండి కానీ బండ్లు నడపొద్దు' అనే ప్లకార్డ్ పట్టుకొని ఆమె పెట్రోల్ బంక్ ముందు నిలబడింది. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు రూ.120 దాటిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో మాత్రం పెట్రోల్ కంటే బీర్ (రూ.140) ధర ఎక్కువగా ఉంది.