దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు షాకిస్తూ సుప్రీం కోర్టు తాజాగా కీలక నిర్ణయం వెలువరించింది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులను సత్వరమే విచారించాలని శుక్రవారం నిర్ణయించింది. ఆయా కేసులపై ఏప్రిల్ 15 నుంచి రెగ్యులర్‌గా వాదనలు కొనసాగుతాయని పేర్కొంది. ఐదేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 2 వేలకు పైగా క్రిమినల్ కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి, తీర్పులు వెలువరించాలని అభ్యర్థించారు. ఆయన విజ్ఞాపనను సుప్రీంకోర్టు అంగీకరించి, తాజా నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa