కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. 8 మంది బాలికపై అత్యాచారం చేసిన ఘటన జరిగింది. యలహంక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై 8 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాలికను బెదిరించి మరీ ఈ ఘోరాన్ని చేశారు. బాలిక ఇంటికి ఏడ్చుకుంటూ రావడాన్ని తల్లిదండ్రులు గమనించి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa