పాక్ కొత్త ప్రధాని ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N)పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌ను.. ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు అధికారికంగా ఎన్నుకున్నాయి. పాక్‍లో పంజాబ్ సీఎం గా కూడా షెహబాజ్ షరీఫ్ పనిచేశారు. పాక్‌లో ఏ ప్రధాని కూడా పూర్తి కాలం పని చేయలేదు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని ప్రధాని పదవిని కోల్పోయిన మొదటి వ్యక్తి ఇమ్రాన్‌ఖానే.