రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అనంతపురం నుంచి ఆయన యాత్ర ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి కొత్త చెరువు గ్రామానికి చేరుకుంటారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. కొత్త చెరువు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి, వారికి జనసేన తరుపున రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని మరో రైతు కుటుంబానికి కూడా సాయం అందజేస్తారు. ఆ తర్వాత ధర్మవరం రూరల్ గొట్లూరు గ్రామం, అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa