వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో కూడిన మందులను సరఫరా చేయాలని అధికారులు జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఏపీలో కోవిడ్ పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటి వరకు 4 కోట్ల 30 లక్షల 81 వేల 428 మందికి రెండు డోస్‌లు వేసినట్లు తెలిపారు. 12-14 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 94.47 శాతం మందికి కూడా టీకాలు వేసినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa