పాక్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిరోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2 వీక్లీ ఆఫ్‌లు రద్దు చేసి ఆదివారమే సెలవు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 8 గంటలకే ఆఫీసులకు రావాలని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు నిజాయితీ, పారదర్శకత, శ్రద్ధతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. పింఛను పెంపు, కనీస వేతనం రూ.25 వేలకు పెంపు హామీలను తక్షణం అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa