ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధ్వానంగా ప్రధాన రహదారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:45 PM

తూర్పు గోదావరి: సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ రోడ్డు అధ్వానంగా మారడంతో రాకపోకలకు వాహనదారులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈనాడు కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో అటు పశ్చిమగోదావరిలోని మూడు నియోజకవర్గాలను విలీనం చేశారు. నిడదవోలు పరిసర ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ఈ మార్గమే ప్రధానం. ప్రస్తుతం ఈ బ్యారేజీపై విజ్జేశ్వరం వరకు రహదారి రూపుకోల్పోయింది.


తారు ఊడిపోయి వంతెన స్లాబ్‌ ఇనుప ఊచలు పైకి తేలాయి. ఎక్కడికక్కడ గుంతలు పడటంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వందల వాహనాలు ఇటు నుంచే రాజమహేంద్రవరం నగరం, జాతీయరహదారికి రాకపోకలు సాగుస్తుంటాయి. రెండేళ్లుగా పరిస్థితి అధ్వానంగా ఉన్నా.. అధికారులు స్పందించడం లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వెలగని విద్యుత్తు దీపాలు:


బ్యారేజీపై ధవళేశ్వరం పరిధిలో 35 విద్యుత్తు దీపాలు ఉన్నాయి. అవి పూర్తిస్థాయిలో వెలగడం లేదు. బ్యారేజీ పిల్లర్లపై పగుళ్ల వద్ద పలుచోట్ల రావి మొక్కలు పెరిగాయి. దీంతో పగుళ్లు పెద్దవవుతున్నాయి. ఆనకట్ట పైనుంచి వర్షపునీరు కిందకి పోయేందుకు ఏర్పాటు చేసిన రంధ్రాలు పూడుకుపోయాయి. వర్షాకాలంలో వాన నీరు బయటకు పోయే దారిలేక చెరువును తలపిస్తోంది.


త్వరలో పనులు చేపడతాం


రహదారి మరమ్మతులకు రూ.50 లక్షలు విడుదలయ్యాయి. ప్రస్తుతం అయిదుసార్లు టెండర్లు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. ఎలక్ట్రికల్‌ పనులకు రూ.30 లక్షలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రక్షణగోడ, ఫుట్‌పాత్‌ తదితర పనులు చేపడతాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa