రాజస్థాన్ జైసల్మేర్ లో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఓ పంచర్ షాప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓవ్యక్తి బైక్కు పంచర్ వేస్తుండగా మరో నలుగురు యువకులు పక్కనే నిల్చొని మాట్లాడుకుంటున్నారు. దీంతో వారి బరువుకు డ్రైనేజీపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబ్ విరిగిపోయింది. దీంతో ఐదుగురు మురికి కాలువలో పడిపోయారు. ఓ బైక్ కూడా వారిపై పడిపోయింది. అదృష్టవశాత్తు వారంతా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa