జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జైనపొరా ప్రాంతంలోని బాడిగామ్లో టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది ధీటుగా స్పందించారు. దీంతో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. వీరంతా లష్కరే తొయిబాకు చెందినవారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa