ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జో రూట్… టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. జో రూట్ 2017లో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు కాగా..తాజాగా రాజీనామా చేశాడు. దాదాపు 5 ఏళ్ల పాటు జో రూట్… ఇంగ్లండ్ జట్టు టెస్టు కెప్టెన్ గా విరోచిత సేవలు అందించాడు.అయితే… కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోయిన రికార్డును జో రూట్ నమోదు చేసుకోవడం గమనార్హం. జో రూట్…. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు.ఇటీవలి కాలంలో పరిస్థితులు అంతగా సహకరించక పోయినా…జో రూట్ అనేక ప్రసిద్ధ సిరీస్ విజయాలకు నాయకత్వం వహించాడు. ఆస్ట్రేలియా మరియు కరేబియన్ పర్యటనల సమయంలో ఇంగ్లండ్ జట్టు ఒక టెస్ట్ గెలవలేకపోయింది. దానికి బాధ్యత వహిస్తూనే రూట్.. కెప్టెన్ పదవికీ రాజీనామా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇక ప్లేయర్ గానే కొనసాగనున్నాడు.