జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఏప్రిల్ 15, శుక్రవారం అర్థరాత్రి ఒక సర్పంచ్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు.బారాముల్లా జిల్లా గోష్బుగ్ పట్టాన్ ప్రాంతంలో సర్పంచ్ మంజూర్ అహ్మద్ బంగ్రూపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.దాడి తరువాత, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు మరియు భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.