ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని కోడుమూరు టీడీపీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ డిమాండ్ చేశారు.
కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు రత్నం ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆకేపోగు ప్రభాకర్ మాట్లాడారు. ఒక్క అవకాశమంటూ జగన్ రెడ్డి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. బస్సు, విద్యుత్ చార్జీలతో పాటు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచడం దారుణమన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బోయ వెంకటేష్ నాయుడు, గ్రామ టీడీపీ నాయకులు నాగరాజు, మాజీ సర్పంచు సోమన్న, నెహ్రూకుమార్, తిమ్మారెడ్డి, చిన్నమునిస్వామి, తుకారం, మోషీ, భీమ, తదితరులు పాల్గొన్నారు.