మహానంది పుణ్యక్షేత్రానికి దైవదర్శనం నిమిత్తమై వచ్చిన భక్తుడు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉండగా తన మెడలోని బంగారు గొలుసు జారిపడి పోయినది. శుక్రవారం ప్రొద్దుటూరుకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులతో క్షేత్రానికి వచ్చారు. తన బంగారు గొలుసు కోనేటిలో జారి పడిపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు శివరాం, మహేష్ లకు తెలియజేశాడు. వారు చెంచు వెంకటేశ్వర్లు సహాయంతో కోనేట్లో వెతికించి భక్తుడికి ఇన్స్పెక్టర్ సురేంద్ర నాథ్ రెడ్డి సమక్షంలో అందజేశారు. ఆ భక్తుడు వారికి కృతజ్ఞతలు తెలిపారు.