ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందజేస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుధాలు అందజేసి తమపై దాడులను ప్రోత్సహిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇకపై ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులు ముమ్మరం అవుతాయని పేర్కొంది. అవసరమైతే అణ్వాయుధాలు మోహరించడానికి కూడా సిద్ధమేనని ప్రకటించింది. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ తాజా హెచ్చరికలు చేశారు. ఇక స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరడానికి ప్రయత్నిస్తున్న వైనం పైనా ఆయన స్పందించారు. బాల్టిక్ సముద్ర తీరంలో తమ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. యుద్ధాన్ని ప్రోత్సహించొద్దని అమెరికాకు ఆయన సూచించారు.