మహిళను శారీరకంగా లోబరుచుకుని వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన దమ్మపేట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. మందలపల్లి గ్రామానికి చెందిన మహిళ తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం. అదే గ్రామానికి చెందిన కనపర్తి అమర్ అనే వ్యక్తి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తాగించి శారీరకంగా లొంగ దీసుకుని, అశ్లీల వీడియోలను చిత్రీకరించాడు.
ఆ వీడియోలను చూపించి మళ్లీ పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాక ఆ మహిళను బ్లాక్ మెయిల్ చేస్తూ తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేకుంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమర్ పై రేప్, ఐటీ యాక్ట్ కేసు, అతడికి సహకరించిన వారిపై ఐటీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.