ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవేశ పెట్టిన శాశ్వత భూరక్ష సర్వే ద్వారా అక్రమాలకు తెరపడుతుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. శనివారం ఉదయం మేజర్ పంచాయితీ తిమ్మాపురం గ్రామంలో శాశ్వత భూరక్ష డ్రోన్ సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో కొన్ని తరాల నుండి దొర్లుతున్న తప్పులు ఈ డ్రోన్ సర్వే ద్వారా రూపుమాసిపోతాయన్నారు.
ఈ సర్వే ద్వారా రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇటువంటి పధకం వచ్చినపుడే రైతాంగం తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధారు సత్యన్నారాయణ,ఎంపిపి బొలిశెట్టి శారదాకుమారి, సర్పంచ్ కర్రి సత్యన్నారాయణ, వైసీపీ నాయకులు పోలిశెట్టి పెదఈశ్వర్రావు, కొణతాల శ్రీనువాసరావు, తదితరులు పాల్గొన్నారు.