జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జడ్పీ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు పిన్నమనేని కోటేశ్వరరావు సేవలను శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ మంత్రులు పిన్నమనేని వేంకటేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పేర్ని నాని, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa