మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా సోమవారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తనకు కేటాయించిన పర్యాటక శాఖపై దృష్టిసారిస్తానన్నారు. తన శాఖ ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంచుతానని చెప్పారు. తన సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది నగరి నియోజకవర్గ ప్రజలేనని కొనియాడారు. ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, 2024లోనూ జగనన్న సీఎం కావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వార్ వన్ సైడేనని పేర్కొన్నారు.