మత్స్యకార ఉనికి ఉపాధిని విఘాతం కలిగించే జీవో నం. 217 బేషరతుగా విరమించుకోవాలని చేపట్టిన కర్నూలు మత్స్యకార హోరు నిరసన దీక్షలో కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీవో నంబర్ 217 వైసీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చి రాష్ట్రంలో మత్స్యకారులకు, బీసీలకు, అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం ఇన్చార్జి ఆకేపోగు ప్రభాకర్, దండు సుందర్రాజు, వడ్డె నాగేష్, పైగేరి రవి, దుర్గ సామెల్, ఐటీడీపీ కోడుమూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు టీ. వేణు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.