పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి.. పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. లంక ప్రభుత్వం అధీనంలో గల సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్క రోజే లీటరు పెట్రోల్‌పై 84 రూపాయల భారం మోపింది.ప్రస్తుతం లంకలో లీటరు పెట్రోల్ ధర 338 రూపాయలుగా ఉంది. సూపర్ డీజిల్ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి… 329 రూపాయలయ్యింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్ ధర 113 రూపాయలు పెరిగి 289 రూపాయలకు చేరింది. ఇక, పెట్రోల్, డీజల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి.బియ్యం ధర 30 శాతం పెరిగింది.. దీంతో మార్కెట్‌లో కిలో బియ్యం ధర ప్రస్తుతం రూ.440కు చేరింది.. కిలో కందిప్పు రూ.600 క్రాస్ చేయగా.. అసలు మార్కెట్‌లో పాల పౌడర్ దొరకని పరిస్థితి.. అయితే, బ్లాక్‌లో నాలుగు వేలు పలుకుతోంది పాల పౌడర్ ధర.. పెట్రో చార్జీల వడ్డనతో ప్రయాణ చార్జీలు కూడా భారంగా మారాయి.. సిటీ బస్సుల్లో టికెట్ల ధరలు యాబై శాతం పెంచేశారు.. మినిమం బస్సు ఛార్జీ రూ.50 రూపాయలుగా చేవారు.. 20-40 రూపాయలకు దొరికే బ్రెడ్ ప్యాకేట్ ఏకంగా రూ. 230 పలుకుతోంది.. దీంతో, పెరిగిన పెట్రోల్ ధరలపై గల్లాఫేస్ రోడ్డు వద్ద లంకవాసుల ఆందోళనలు చేస్తున్నారు.. మరోవైపు, శ్రీలంక అధ్యక్షుడి అధికారాలకు కోత పెడతామంటున్నారు ప్రధాని మహింద రాజపక్సే. పార్లమెంట్‌కు మరింత సాధికారత కల్పిస్తామంటున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది శ్రీలంక. ఈ పరిస్థితికి రాజపక్సే కుటుంబ సభ్యులే కారణమంటూ ఆందోళనలు చేస్తున్నారు జనం. ముఖ్యంగా అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్సే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు జనం. అలాగే, రాజపక్సే కుటుంబ సభ్యులు పలువురు కీలక పదవుల్లో ఉన్నారు. దీంతో వీళ్లంతా దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పదవులు వీడేందుక సిద్ధంగా లేరు అధ్యక్షుడు రాజపక్సే. ఈ పరిస్థితుల్లో ప్రధాని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.