రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మరియా షరపోవా మంగళవారం తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తాను గర్భవతినని ప్రకటించింది. బీచ్లో తీసుకున్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. "అమూల్యమైన ప్రారంభం.. ఇద్దరికీ(బిడ్డతో కలిపి) పుట్టినరోజు కేక్ తినడం నా ప్రత్యేకత" అని రాసింది. షరపోవా 2020లో ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడడం మానేసింది. అంతకు ముందు ఐదు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (కెరీర్ స్లామ్తో సహా) సాధించింది. డబ్ల్యుటీఏ నంబర్ 1గా 21 వారాల పాటు కొనసాగింది. కెరీర్ గ్రాండ్ స్లామ్ గెలిచిన ఏకైక రష్యన్ మహిళగా పేరొందింది. డిసెంబర్ 2020లో బ్రిటిష్ మిలియనీర్ అలెగ్జాండర్ గిల్కేస్తో షరపోవా నిశ్చితార్థం జరిగింది. ఇక గిల్కేస్, ప్రిన్స్ విలియమ్ స్నేహితులు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు.