ఇంకొల్లు గ్రామంలోని పర్చూరు రోడ్ లో ఎస్ ఐ ఎన్ సి ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి రోజు కూడా సాయంత్రం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.
మద్యం సేవించి వాహనాలు నడపటం నేరమని తెలిపారు అలా నడిపే వారు పట్టుబడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.