ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాలలకు క్రీడా మైదానం ఏర్పాటు చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 01:20 PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తొలిసారిగా రాష్ట్ర క్రీడా శాఖా, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కొరుతూ వున్నారు. గతంలో మూడు పర్యాయాలు శాప్ చైర్మన్ గా పనిచేసిన దివంగత టీడీపీ నేత పీఆర్ మోహన్ చిత్తూరు జిల్లాకు చెందిన వారు అయినా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు తగు నిర్ణయాలు తీసుకోలేకపోయారన్న విమర్శలు వున్నాయి.


ఏ నాయకులైనా ఉపన్యాసంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని, తద్వారా శారీరకంగా, మానసికంగా అభివృద్ది సాధించడంతో పాటు ఆయా పాఠశాలలకు వన్నె తేవాలని సూచించడం తప్ప. క్రీడాభివృద్దికి తీసుకున్న చర్యలు నామమాత్రమే అని చెప్పాలి. వాస్తవానికి పలు ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానం లేక ఎందరో క్రీడల పట్ల ఆసక్తి వున్న విద్యార్థులు క్రీడల్లో పాల్గొనలేకపోతూ వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో నగరి నుంచి క్రీడా మంత్రి అయిన మంత్రి ఆర్ కే రోజా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో క్రీడాకారులును అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని క్రీడా మైదానాలు ఏర్పాటుకు, క్రీడా సామగ్రీ కల్పనకు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి మంత్రి ఆర్ కే రోజా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa