శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద గురువారం విజన్ ఇంకో ఫౌండేషన్ (వీకేఎఫ్ ) వారు, ఆర్. ఆర్ షుగర్ , ఫివర్ అండ్ డెంటల్ క్లినిక్ వారి సౌజన్యంతో ఉచితంగా ఆంబులెన్స్ సర్వీసు ను పెనుకొండ సబ్ కలెక్టర్ ఎం నవీన్, ఏ జి పి ఎం. భాస్కర్ రెడ్డి ల చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత అంబులెన్సు సర్వీస్ ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. పెనుకొండ పరిసర గ్రామస్థులకు అనుకూలంగా అత్యవసర వైధ్యచికిత్స నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్ళడానికి ఉచిత ఆంబులైన్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ అంబులెన్స్ కు ఎలాంటి అధిక చార్జీలు లేకుండా కేవలం డ్రైవర్ కు, డీజల్ చార్జీలు మాత్రమే చెల్లించి సద్వినియోగం చేసుకోగలరని డాక్టర్ రోహిల్ పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవాలని కోరుతూ ఉచిత ఆంబులెన్స్ కోసం 815-108-108-5, 9502125625సంప్రదించాలని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa