ప్రేమ కోసం పురుషుడిగా మారిన ఓ మహిళ ప్రియురాలి చేతిలో దారుణంగా మోసపోయింది. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది. విల్లాపురం మీనాక్షినగర్ ప్రాంతానికి చెందిన జయసుధకు ఉమచ్చికులం ప్రాంతానికి చెందిన సెంథిలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పురుషుడిగా మారాలని జయసుధపై సెంథిల ఒత్తిడి చేసింది. 2021 లో మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జయసుధ శస్త్రచికిత్స చేయించుకుంది. తన పేరును ఆదిశివగా మార్చుకుంది. ఆ తర్వాత ఆదిశివ, సెంథిల ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం సెంథిల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తిరుప్పరకుండ్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులతో వెళ్లిపోతానని సెంథిల చెప్పింది. తనకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ కు బుధవారం ఆదిశివ వినతిపత్రం అందజేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa