ఏపీ సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో గురువారం పర్యటించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్ ను గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో గ్రాసిమ్ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని. ఆందోళనకారులపై ఆ కేసులను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. ఈ రోజే జీవో విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రాసిమ్ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందని సీఎం జగన్ అన్నారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా చట్టం చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa