కర్నూలు జిల్లాలో పిడుగు పాటుకు నలుగురు మృతి చెందారు. కుప్పగల్ లో ఇద్దరు మహిళలు, హోలగుందలో ఇద్దరు మరణించారు. దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. వారు వ్యవసాయ పనుల్లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. మధ్యాహ్నాం 3 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురుస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa