గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. తాడేపల్లి, విజయవాడ మధ్య ఉన్న కనకదుర్గమ్మ వారధిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంతో వారధిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించి మృత దేహాన్ని మార్చరీకి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa