పుట్టగొడుగుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- పుట్టగొడుగులతో రక్తపోటు అదుపులో ఉంటుంది.
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- పుట్టగొడుగులతో సెలీనియం, థయామిన్, విటమిన్-డి లాంటి పోషకాలెన్నో లభిస్తాయి.
- తాజా పరిశోధన ప్రకారం పుట్టగొడుగులు మన మెదడునూ ఆరోగ్యంగా ఉంచుతాయని తేలింది. - పుట్టగొడుగుల్లో 'ఎర్గోథియనీన్' అనే అరుదైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మానసిక సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి అరుదైన వ్యాధులతో పాటు డిప్రెషన్‌ను కూడా సమర్థంగా అడ్డుకుంటుంది.
- పుట్టగొడుగులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేస్తాయి. ఇందుకోసం లివర్ బాగా పనిచేసేలా చేస్తాయి. లివర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తీసేస్తుంది. అందువల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. బీపీ పేషెంట్లకు పుట్టగొడుగులు ఎంతో ప్రయోజనకరం.
- కాన్సర్ నివారణలో పుట్టగొడుగులు బాగా పనిచేస్తాయట. మైటేక్, క్రిమినీ, పోర్టాబెల్లా, ఓయస్టర్, వైట్ బటన్ వంటి రకాల పుట్టగొడుగులు బ్రెస్ట్ కాన్సర్ ను తగ్గిస్తున్నాయి. ఇవి శరీరంలో కొత్త కణాలు పెరిగేలా చేస్తున్నాయి. వాటిలోని లెంటినాన్ అనే షుగర్ మాలిక్యూల్ కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తోంది.