రూ.139 కోట్ల డోరండా ట్రెజరీ కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
డోరాండా ట్రెజరీ నుండి రూ. 139 కోట్లకు పైగా అపహరణకు సంబంధించిన దాణా కుంభకోణం కేసులో 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ ఫిబ్రవరిలో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించించింది. ఈ కేసులో బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టును లాలూ ఆశ్రయించారు. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో లాలూ ఇప్పటికే తన ఐదేళ్ల శిక్షలో సగం కాలం పూర్తి చేశారు. దీనికి సంబంధించి ట్రయల్ కోర్టు ధృవీకరించిన కాపీని కోర్టుకు సమర్పించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిందని లాలూ ప్రసాద్ తరపు న్యాయవాది ప్రభాత్ కుమార్ తెలిపారు.