టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బొండా ఉమాకు ఏపీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 27న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశాలిచ్చింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చంద్రబాబు,బొండా ఉమాలు కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పట్ల అగౌరవంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఈ సమన్లు జారీ చేశారు.