రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. పౌరసరఫరాల శాఖపై సమీక్షించిన ఆయన.. రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు జమ చేస్తామన్నారు. 'ప్రజలకు పోషకాహారం కోసం పోర్టిఫైడ్ బియ్యం ఇస్తున్నాం. ఈ రైస్‌ను నీటిలో కడిగితే తేలుతాయి. వీటిని ప్లాస్టిక్ బియ్యంగా భావించొద్దు. యాప్‌లో లోపంతో రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కనపెట్టాం' అని ఆయన అన్నారు.