రేషన్ బియ్యానికి బదులుగా నగదు బదిలీ పథకాన్ని చేపట్టిన ఏపీ సర్కారు దానిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో దీనిని ప్రారంభించగా ఎక్కువ మంది ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. తాజాగా ఈ అంశంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు.
దీనికి సంబంధించిన యాప్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, అవి ప్రజలకు కచ్చితంగా చేరవేస్తామని తెలిపారు.