వి. మాడుగుల మండలంలోని కొత్తవలస గిరిజన గ్రామం కొండవాగు ప్రాంతంలో శుక్రవారం అక్రమ సారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు మాడుగుల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ పరివర్తన లో భాగంగా కొత్తవలస పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 1950 లీటర్ల సారాయి కు ఉపయోగించే బెల్లపు వూటను అలాగే 15 లీటర్ల సారాయిని, ఒక ముద్దాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం కొత్తవలస ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి సారాయి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అక్రమంగా సారాయి తయారు చేసిన, రవాణా చేసిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వారి రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలను కూడా రద్దు చేయడం జరుగుతుందన్నారు.