ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు కొనివ్వలేదని పెళ్లిలో హ్యాండిచ్చిన వరుడు!

national |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 02:11 PM

వరకట్నం నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినా, ఆడ పెళ్లి వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. పెళ్లిలో తమకివ్వాల్సిన కట్నం తక్కువైందనే, లాంఛనాలు సరిగ్గా లేవనో కొందరు వధువులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ వరుడు ఇలాంటి పనే చేశాడు. కార్ కొనివ్వలేదని పెళ్లికి రావడం మానేశాడు. దీంతో పెళ్లి ఆగిపోయందనే బాధతో వధువు, ఆమె కుటుంబికులు రోదిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


యూపీలోని లఖింపూర్ ఖేరీలోని మగల్గంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన చురాయ్ పూర్వా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తన కుమార్తె మధుబాల వివాహం ఏర్పాటు చేశాడు. గోలా మొహమ్మదీ నివాసి పంకజ్ కుమార్‌తో పెళ్లి నిశ్చయించారు. ఇటీవల వివాహానికి తేదీ నిర్ణయించి, బంధువులందరినీ వేడుకకు పిలిచారు. అల్లుడు కోరిన కానుకలన్నీ సమర్పించాడు. అయితే పెళ్లి రోజు వరుడు పంకజ్‌, అతడి తరుపు వారి నుంచి కొత్త డిమాండ్లు వచ్చాయి. పెళ్లి రోజు ఊరేగింపుగా రావడం అక్కడ ఆనవాయితీ. ఊరేగింపు నాటికే ఆల్టో కారు, ట్రాక్టర్, రూ.3 లక్షల నగదును అడిగారు. పెళ్లి రోజు హఠాత్తుగా అడిగితే తాను ఎక్కడి నుంచి తీసుకు రాగలనని వధువు తండ్రి అనిల్ లబోదిబోమన్నాడు.


పెళ్లి జరిగిన కొన్ని రోజుల్లోనే అవన్నీ అందజేస్తానని అందరి సమక్షంలో హామీనిచ్చాడు. ఈ క్రమంలో పెళ్లి రోజు వరుడు, అతడి బంధువులు ఊరేగింపుగా రావాల్సి ఉంది. వధువు తరుపు వారిలో ఆందోళన ఎక్కువవుతోంది. తరచూ వారికి ఫోన్ చేస్తుంటే ఊరేగింపుగా వస్తున్నట్లు బదులిచ్చేవారు. రాత్రి వరకు ఎదురు చూసినా వరుడు రాలేదు. దీంతో వివాహ వేడుకకు ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశామని, పెళ్లి ఆగిపోతే తామెలా తలెత్తుకోవాలని రోదించాడు. మరోవైపు పెళ్లి ఆగిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని వధువు మధుబాల చెప్పింది. దీంతో వరుడు తీరును అంతా విమర్శిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com