రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రజలకు అత్యద్భుతమైన సేవలు అందిస్తున్నట్లు నగర మేయర్ ఎస్ అముద చెప్తారు. శనివారం నగరంలోని 39వ వార్డు సచివాలయంలో వలంటీర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ. వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న 10 మంది వలంటీర్లను శాలువాతో సత్కరించి, సేవా మిత్ర ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్యదర్శులు, స్థానిక నాయకులు లోకేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.