నార్పల మండల పరిధిలోని బి పప్పూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ దాత్తత్రేయ భజన బృందం, గ్రామస్తుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. వేదపండితులు ఫణి శర్మ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి అలయంలో అంకురార్పణ, దేవతా మంత్రజపము, అగ్ని ప్రతిష్ట దీక్షహోమం, మహాగణపతి హోమాలు, మంగళహారతులు నిర్వహించారు. శనివారం వేకువజామున గణపతి పూజ, ప్రాతఃకాల పూజ, యంత్రస్థాపన, ప్రతిష్ఠహోమం, ప్రాణ ప్రతిష్ట హోమాలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్టిం చారు.
తదుపరి అభిషేకం, కుంభాభిషేకం, బలిహారం, గోదర్శనము, కలసోద్వాసన మహా మంగలహారతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉపాన్యాసా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించి తీర్థపప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి అలం నరసానాయుడు, అలం వెంకట నరసానాయుడు స్వామి వారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అలం సోదరులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రాతిధులం లాగుడు పోటీ. లు, ట్రాక్టర్ పందేలు ఇరుసుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ భజన బృందం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.