చిరుధాన్యాలు తింటే ఆరోగ్యంగా ఉంటారని సహజ ఆహార నిపుణులు డాక్టర్ సరళ పేర్కొన్నారు. మండలంలోని హంసా పురం ఆదరణ పాడి పశువుల వ్యవసాయ క్షేత్రంలో పర్యావరణ జీవనం సంపూర్ణ ఆరోగ్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం వ్యాయామం, యోగా, చిరుధాన్యాల తిండి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, డాక్టర్ సరళ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డాక్టర్ రాయణ, గంగిరెడ్డి,శంకర్, ఆదరణ సంస్థ ఛైర్మన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa