ఈనెల 20వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకునేందుకు చిన్నారులతో సహా కారులో తిరుపతి వెళుతూ మార్గమధ్యము ఒంగోలులో రాత్రి 10 గం సమయంలో టిఫిన్ చేసేందుకు హోటల్ వద్ద ఉండగా CM జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అధికారులు తమ వద్ద నుండి బలవంతంగా కారును తీసుకొని వెళ్లారు. అర్ధరాత్రి భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో నడిరోడ్డుపై ఉన్న కుటుంబం 2 గంట వరకు పడిగాపులు కాస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సమయానికి మీడియా ప్రతినిధులు అక్కడికి వచ్చి అడగడంతో జరిగిన అన్యాయాన్ని వివరించారు. అనేక ఇబ్బందులు పడుతూ దైవ దర్శనం చేసుకుని ఎట్టకేలకు ఇల్లు చేరితే ఒంగోలు SP ఆఫీస్ నుంచి, RTO అధికారుల నుండి రెండు రోజులుగా విచారించాలంటూ ఒంగోలు కు రావాలని ఫోన్లు చేస్తున్నారు. దీనితో కుటుంబ సభ్యులు ఏమి జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. విచారణ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.