జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేస్తామంటూ ఆయన యాత్ర చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ సాయం చేస్తానంటున్న 40 మందిలో ప్రభుత్వం ఇప్పటికే 8 కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం అందజేసింది.
అయితే అసలు రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు మొదలయ్యాయన్నది పవన్‌కళ్యాణ్ ఆలోచించాలి. 2014 ఎన్నికలకు ముందు రైతులకు ఉన్న రూ.87 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత మాట తప్పారు. దాంతో రైతులు చాలా మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అప్పుడు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఈ దత్తపుత్రుడు రైతుల మరణాల గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశంలో తెలియచేసారు.