కోడుమూరు మండల వ్యాప్తంగా ఈనెల 27వ తేదీ నుండి నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి అనంతయ్య యాదవ్ తెలియజేశారు. మండల వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
విద్యార్థులకు తాగునీరు, పలు పరికరాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా కనబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa