సీపీఎస్ రద్దు చేయకుండా మరో కమిటీ నియమించడాన్ని నిరసిస్తూ మంగళవారం పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టినట్లు ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగ రావు, మక్కెన శ్రీనివాసరావు లు తెలిపారు.
సీఎం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి 3 ఏళ్ళు దాటినా విస్మరించారన్నారు. నిరసనలకు ఉపాధ్యాయులు నల్లజెండాలు ధరించి అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు.