గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పడవల రేవు వద్ద ఓ యువకుని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కృష్ణా నదిలో మృతదేహం పైకి తేలడంతో స్థానికులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా మృతుడు పల్లె అశోక్ రెడ్డి (21) అద్దంకి మండలం కలవకూరు గ్రామం గా గుర్తించారు.
మృతుడు ప్రస్తుతం విజయవాడలోని ఓ కళాశాలలో సీఏ చదువుతున్నటు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసామని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.